పసిమొగ్గపై పైశాచికం పడగవిప్పింది. మద్యం, గంజాయి మత్తులో ఓ నరరూప రాక్షసుడు ఐదేళ్ల చిన్నారిని పొట్టనబెట్టుకున్నాడు. గాఢనిద్రలో ఉన్న చిన్నారిని ఎత్తుకెళ్లి, కేకలు వేయకుండా నోట్లో గుట్కా కుక్కి మరీ లైంగిక దాడికి ఒడిగట్టాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలు వదిలిన ఆ చిన్నారి విషాదం ప్రకాశం జిల్లాను కన్నీటి సంద్రంలో ముంచెత్తింది. ప్రకాశం జిల్లాలో అత్యంత హేయమైన, అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మద్యం, గంజాయి మత్తులో ఓ కామాంధుడు ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా చిన్నారి అరవకుండా నోట్లో గుట్కా కుక్కి పైశాచికంగా ప్రవర్తించాడు.