ఐపీఎల్ 2027 మినీ వేలానికి తేదీ ఖరారైనట్లు సమాచారం. డిసెంబర్ 16న గోవాలో ఈ వేలం నిర్వహించనున్నట్లు క్రిక్ఇన్ఫో తెలిపింది. ఆసక్తికరంగా అదే రోజు బెంగళూరులో భారత్ (India), శ్రీలంక (Sri Lanka) మధ్య రెండో వన్డే జరగనుంది. 2028 సీజన్‌కు ముందు జరగబోయే మెగా వేలానికి ఇదే చివరి మినీ ఆక్షన్ కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) 2027 సీజన్ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. తాజాగా ఐపీఎల్ 2027 మినీ వేలం తేదీపై కీలక సమాచారం బయటకు వచ్చింది.