ఆదివాసీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రూ.120 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి.. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని పునరుద్ఘాటించారు. రాజకీయాలకు అతీతంగా, అధికార ప్రతిపక్షాలనే తేడాలు లేకుండా ప్రజల.