ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత సీజన్‌కు సంబంధించిన సన్నాహాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాబోయే సీజన్ కోసం ఆటగాళ్ల మినీ వేలాన్ని డిసెంబరు 16న గోవా వేదికగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ వేలానికి సంబంధించిన సన్నాహక సమావేశాన్ని (బ్రీఫింగ్) డిసెంబరు 15న నిర్వహించనున్నారు. దీనికోసం అన్ని ఫ్రాంచైజీలకు ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. వేలం ప్రక్రియకు ముందే ఫ్రాంచైజీలు తమ జట్లలో రిటైన్, అలాగే రిలీజ్ చేసే ఆటగాళ్ల.