రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై గులాబీ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తెలంగాణలో సాగునీటి నిర్వహణపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతూ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుత ప్రభుత్వానికి నదుల నుంచి నీటిని ఒడిసిపట్టే కనీస పరిజ్ఞానం లేదని మండిపడ్డారు. ఎల్నినో ప్రభావం, తాగు, సాగునీటి ఎద్దడిపై ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ ద్వారా ఎంతో చాకచక్యంగా నీటిని తరలించుకుపోతుంటే.. మన ప్రభుత్వం.