ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా, ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. దిశ,జనగామ : ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా, ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. సోమవారం జనగామ జిల్లా సమీకృత కలెక్టరేట్లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.