International Silver Price: అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో గత కొంత కాలంగా బంగారం, వెండి ధరలు విపరీతంగా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ ప్రధానంగా వెండి ధరల గురించి తెలుసుకోవాలి. ఈ ఏడాది జనవరిలో సిల్వర్ రేటు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలకు చేరగా అక్కడి నుంచి చూస్తే సగానికిపైగా పతనం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో 55 శాతానికిపైగా పడిపోగా, దేశీయంగా హైదరాబాద్లో కేజీపై రూ. 2.05 లక్షలు తగ్గింది.