సాంప్రదాయ పెట్టుబడి మార్గమైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఇప్పటికీ తమ పెట్టుబడి మార్గంగా చాలామంది ఎంచుకుంటున్నారు. అయితే బ్యాంకుల్లో చేసే ఎఫ్డీలు సురక్షతమేనా అనే అనుమానం చాలామందికి ఉంటుంది. అయితే మీరు చేసే డిపాజిట్లకు రూ.5 లక్షల బీమా కవరేజీ లభిస్తుంది. దీంతో మీరు డబ్బులు సురక్షితమని చెప్పవచ్చు. తమ డబ్బులను పొదుపు చేసుకునేందుకు చాలామంది సాంప్రదాయ మార్గమైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఎంచుకుంటారు. తాము కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంక్ ఎఫ్డీలలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. దీని వల్ల ఆదాయం రావడంతో పాటు డబ్బులు సురక్షితంగా ఉంటాయని భావిస్తారు.