మహారాష్ట్రలో ప్రేమ వివాహం వివాదం పెళ్లి మండపంలో తీవ్ర ఘర్షణకు దారితీసింది. యోలా పట్టణంలో జరిగిన వివాహ వేడుకలో వరుడిపై డీజిల్ పోసి నిప్పంటించేందుకు యత్నించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇరువర్గాల మధ్య జరిగిన దాడిలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారన్న కోపంతో యువతి కుటుంబం కక్షగట్టింది. ప్రేమ పెళ్లిపై అసంతృప్తితో ఏకంగా వరుడిపై డీజిల్ పోసి సజీవంగా తగలబెట్టేందుకు యత్నించిన భయానక ఘటన మహారాష్ట్రలో జరిగింది. కళ్యాణ మండపంలో వధూవరుల బంధువుల మధ్య జరిగిన భీకర పోరులో 8 మందికి గాయాలయ్యాయి.