నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం తాటికల్లు వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న నలుగురిని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం లేదా మద్యం సేవించి వాహనం నడిపాడనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నకిరేకల్ (నల్గొండ): నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం తాటికల్లు వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్న వాకర్లపైకి అతివేగంతో వచ్చిన ఓ కారు యముడిలా దూసుకొచ్చింది.