మన అందమైన చిరునవ్వుకు మెరిసే తెల్లటి దంతాలు ఎంతో ముఖ్యం. అయితే ఇటీవల కాలంలో చాలామందిలో దంతాలపై నల్లటి మరకలు లేదా డాగులు ఏర్పడుతుండటం గమనించవచ్చు. దంతాలపై ఇలా నల్లగా మారుతుండగానే అందరూ వెంటనే అది ఏదో కీడు లేదా పుచ్చిపోవడం అని కంగారు పడిపోతుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు చాక్లెట్లు, స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల దంతాలు నల్లబడతాయని భావిస్తుంటాం. కానీ దంతాల నడమ వచ్చే నల్లటి మచ్చలకు కేవలం కీటీలు మాత్రమే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు.