ప్రముఖ నటుడు సంపత్ రాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్,స్టార్ హీరోలతో అనుభవం, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తనకున్న గౌరవం, అలాగే తన సొంత రైటింగ్ ప్రాజెక్టుల గురించి పంచుకున్నారు. ఆయన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తన కెరీర్ తొలినాళ్లలో కొందరు హీరోలు తనను విలన్ గా పెట్టుకుంటే మ్యాచ్ చేయలేము అని చెప్పి కొన్ని ప్రాజెక్టులు మిస్ అయ్యాయని సంపత్ రాజ్ తెలిపారు. అయితే, మహేష్ బాబుతో సహా చాలా మంది స్టార్ హీరోలతో తాను కలిసి పనిచేశానన్నారు. ముఖ్యంగా శ్రీమంతుడు సినిమా తనకు చాలా పెద్ద ఇంపాక్ట్ ఇచ్చిందని పేర్కొన్నారు.