ప్రముఖ దివంగత నటుడు, దర్శకుడు ఏవీఎస్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దర్శకత్వ అనుభవాలు, ఆర్థిక సవాళ్లు, తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్ల స్థానం వంటి అనేక అంశాలపై ఆయన మాట్లాడారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. . తన కెరీర్ను "యాక్షన్ ఫిలిం"గా ఏవీఎస్ అభివర్ణించారు. ఎవరి దృష్టిలో వారే హీరోలు, కాబట్టి నేను గెలుస్తాను" అని ఆయన అన్నారు. కమెడియన్ల పాత్ర గురించి మాట్లాడుతూ, హీరోలు గెలిచారంటే అది కమెడియన్ల గొప్పతనమేనని పేర్కొన్నారు.