Supreme Court: హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంత పరిరక్షణకు సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు నేడు (2026 అక్టోబర్ 26) కీలక తీర్పు వెలువరించే అవకాశముంది. అటవీ భూముల ధ్వంసం, పర్యావరణ పరిరక్షణను అత్యంత తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం దాఖలు చేసుకున్న ‘సుమోటో రిట్ పిటిషన్ (సివిల్) నం. 3/2025’ (ఇన్ రీ: కంచా గచ్చిబౌలి ఫారెస్ట్, తెలంగాణ రాష్ట్రం)పై తుది తీర్పు కోసం జాబితా అయింది. గచ్చిబౌలి పరిధిలోని కంచా ప్రాంతంలో భారీ యంత్రాలతో వందలాది చెట్లను నేలమట్టం చేస్తున్నారని, వన్యప్రాణుల ఉనికికి ముప్పు వాటిల్లుతోందని పత్రికల్లో వచ్చిన కథనాలను అమికస్ క్యూరీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.