Maredumilli Woods Resorts Fire: పోలవరం జిల్లా మారేడుమిల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ వుడ్స్ రిసార్ట్స్‌లోని వీఐపీ కాటేజీలో మంటలు చెలరేగడంతో చెక్కతో నిర్మించిన సూట్ రూములు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫర్నిచర్‌తో పాటు ఇతర సామగ్రి అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.30 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. అయితే ప్రమాదానికి గంట ముందే పర్యాటకులు సూట్ రూములను ఖాళీ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక.