Rahul Gandhi Convoy Accident: లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ కాన్వాయ్కి ప్రమాదం జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ వైపు వెళ్తుండగా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఆయన కాన్వాయ్ వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. అయితే ఈ ఘటనలో రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న ప్రధాన వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీ లక్నోలోని నివాసం నుంచి సుల్తాన్పూర్ పర్యటనకు.