Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతానికి ‘అర్నాబ్’ తుఫాన్ పెను ముప్పుగా మారుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగండం తుఫాన్‌గా బలపడిందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం విశాఖకు 650, కాకినాడకు 730, మచిలీపట్నానికి 830, బాపట్లకు 900 కిలోమీటర్ల కేంద్రీకృతమై ఉందని ఐఎండీ పేర్కొంది. తీవ్ర తుఫాన్‌గా బలపడుతూ తీర ప్రాంతాల వైపు దూసుకొస్తోంది. ఈ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మారే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు..