నగరపాలక సంస్థ ఎన్నికల్లో అభ్యర్థులు తమ ప్రచార కార్యక్రమాల్లో చిన్న పిల్లలను సైతం దింపారు. కరపత్రాల పంపిణీ, ప్రచార కార్యక్రమంలో డ్రమ్స్ మోగించడం వంటి పనుల్లో చిన్నారులు పాల్గొన్నారు. గుంటూరు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ ఎన్నికల్లో అభ్యర్థులు తమ ప్రచార కార్యక్రమాల్లో చిన్న పిల్లలను సైతం దింపారు. పిల్లలను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించరాదన్న కనీస స్పృహ కూడా లేకుండా కొంతమంది అభ్యర్థులు వ్యవహరిస్తున్నారు. గుంటూరు నగరంలోని 27వ డివిజన్ పరిధిలో వైసీపీ అభ్యర్థి తన ప్రచార కార్యక్రమంలో పిల్లల్ని వినియోగించారు. చిన్నారులతో డ్రమ్స్ మోగిస్తూ ప్రచారం కార్యక్రమాన్ని హోరెత్తించారు.