రవాణా శాఖలో రోజుకో నిబంధన వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం లెర్నింగ్ లైసెన్సు పొందిన తర్వాత శాశ్వత డ్రైవింగ్ లైసెన్సుకు వెళ్లే ముందు సుమారు మూడు గంటలు వీడియో చూస్తూ ట్రాఫిక్కు సంబంధించిన వివిధ అంశాలకు సమాధానాలు ఇవ్వాలనే నిబంధన పెట్టింది. బాలసముద్రం, న్యూస్టుడే: రవాణా శాఖలో రోజుకో నిబంధన వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నెల 9 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. రవాణా శాఖలో శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు స్లాట్ బుక్ చేయగానే సంబంధిత వాట్సాప్ నంబరుకు తెలంగాణ ట్రాన్స్పోర్టు అనే లింక్ వస్తుంది. దానిని తెరవగానే ముందుగా భాషను (తెలుగు, హిందీ, ఇంగ్లిష్) ఎంచుకోవాలి.