తల్లిదండ్రులు కొడుకును ఉన్నత ఉద్యోగిగా చూడాలన్న తపనతో ఆంగ్ల మాధ్యమంలో చేర్పించారు. కానీ ఆ బాలునికి తెలుగుపై మక్కువతో రచయితగా, దర్శకుడిగా రాణించాలన్నది లక్ష్యం. కేయూ క్యాంపస్, న్యూస్టుడే: తల్లిదండ్రులు కొడుకును ఉన్నత ఉద్యోగిగా చూడాలన్న తపనతో ఆంగ్ల మాధ్యమంలో చేర్పించారు. ఆయనే భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన దేవేందర్. కేయూలో ఎంబీఏ పూర్తి చేసిన ఆయన వర్సిటీకి ఎదురుగా నివసిస్తూ ప్రస్తుతం దర్శకుడిగా, రచయితగా రాణిస్తున్నారు. చిన్నతనంలోనే తెలుగుపై ఆసక్తితో పద్యాలు కంఠస్థం చేసేవారు. డిగ్రీలో ఉండగా తాను చదివిన అలిశెట్టి ప్రభాకర్ కవితలు అతన్ని రచన వైపు అడుగులు వేయించాయి.