భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర అవగాహన ఉంటేనే కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. అయితే ఉద్యోగ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ వ్యవహారాల కారణంగా కొన్నిసార్లు దంపతుల మధ్య చిన్నచిన్న అభిప్రాయ భేదాలు తలెత్తుతుంటాయి. ఇలాంటి సమయంలో ఇంటి వాతావరణం ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవడం మంచిది. వాస్తు శాస్త్రంలో ఇంటి అమరిక, పడకగది దిశ, రంగులు, వస్తువుల క్రమబద్ధతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు.