ఉత్తరాఖండ్‌కు చెందిన రవి తామ్తా ఇంజినీరింగ్ విద్య లేకుండానే 13 ఏళ్ల పాటు ఇంటర్నెట్ ద్వారా నేర్చుకుంటూ, స్వయంగా ప్రయోగాలు చేసి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్ నమూనాను రూపొందించారు. ఆయన తయారు చేసిన HAPIDA SKYNeX ఆగస్టులో పరీక్షా ప్రయాణాన్ని పూర్తి చేసింది. పట్టుదల, నిరంతర అభ్యాసం, కొత్త ఆలోచనలతో ముందుకు సాగితే అద్భుత ఆవిష్కరణలు సాధ్యమని ఆయన ప్రయాణం నిరూపిస్తోంది.. ఉన్నత చదువులు చదివితేనే గొప్ప ఆవిష్కరణలు చేయగలమనే అభిప్రాయాన్ని ఉత్తరాఖండ్‌కు చెందిన రవి తామ్తా తన ప్రయోగాలతో సవాలు చేస్తున్నారు.