India Women vs Zimbabwe Women: బరోడాలో జింబాబ్వేతో జరిగిన రెండో మహిళల వన్డేలో భారత జట్టు సత్తా చాటింది. హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత శతకంతో 126 పరుగులు చేయగా, దీప్తి శర్మ 106 పరుగులతో మెరిసింది. భారత్ 50 ఓవర్లలో 328 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 207 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 121 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.