Kharge Controversy: కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారాయి. పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ నేతలు కాంగ్రెస్, రాహుల్ గాంధీ, ఖర్గేలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రధాని కుటుంబంపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఖర్గే అన్ని మర్యాద హద్దులు దాటారని విమర్శించారు. కాంగ్రెస్ విధానపరమైన అంశాలపై మాట్లాడేందుకు ఏమీ లేకపోవడంతో తిట్ల రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు..