నాగ్‌పూర్: అద్దె అడిగితే డబ్బులు లేవని చెప్పేవాళ్లను చూసి ఉంటాం.. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా నోట్లే అచ్చేసే పనిలో దిగాడు! అద్దె గదిలో ప్రింటర్ పెట్టి రూ.500 నకిలీ నోట్లను ముద్రిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికాడు. చివరకు గది తాళం తెరిస్తే బయటపడింది నోట్ల కట్టల బాగోతం. నాగ్‌పూర్‌లో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అద్దె బకాయి.. నోట్ల ముద్రణ నాగ్‌పూర్‌లోని ఖర్బీ ప్రాంతంలో పుష్పక్ కృష్ణ భండార్కర్ అలియాస్ బెండానే.