అర్నబ్ తుఫాను నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తత, అత్యున్నత సన్నద్దత, ముందస్తు ప్రణాళికతో అన్ని స్థాయిల్లో యంత్రాంగం పని చేయాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలి…ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలి అని ఆదేశించారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసుకుని ప్రజలకు అవసరమైన సూచనలు చేయాలని ఆదేశించారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకూడదు…ఆస్తి నష్టం సాధ్యమైనంత తగ్గించాలని సిఎం సూచించారు..