తెలంగాణలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించే చారిత్రక ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణాన్ని సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. గతంలో ఒప్పందాల దశలోనే నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ఆయన చేపట్టిన చర్యలు ఇప్పుడు తుది దశకు చేరాయి. ఇందులో భాగంగానే సోమవారం ముంబై వేదికగా మహారాష్ట్ర ప్రభుత్వంతో బ్యారేజీ ఎత్తుపై అత్యంత కీలకమైన చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం ప్రభుత్వం.