బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ముప్పు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో యంత్రాంగం అప్రమత్తమైంది. దీని ప్రభావం పర్యాటక రంగంపై కూడా పడింది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రకు మరోసారి బ్రేక్ పడింది. తుఫాన్ ముప్పు పొంచివున్న కారణంగా గోదావరి నదిలో బోటు షికార్లను తాత్కాలికంగా నిలిపివేస్తూ రంపచోడవరం సబ్ కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి టూరిజం బోట్ల రాకపోకలను పూర్తిగా బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. భద్రతా చర్యల్లో భాగంగా 16 బోట్లు.