విజయవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో జనసేన మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా, ఇండిపెండెంట్ అభ్యర్థి ఏబీ వెంకట్వేశ్వరరావు ఒకరికొకరు ఎదురుపడ్డారు. దిశ, వెబ్ డెస్క్: విజయవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరూ పలకరించుకుని ఆలింగనం చేసుకుని, ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరు ప్రత్యర్థులుగా బరిలో దిగుతూ ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకోవడం చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఏపీ ప్రస్తుత పరిస్థితుల నడుమ వీరుద్దరూ చేసిన పనికి అంతా మెచ్చుకుంటున్నారు.