ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసింది. అప్పీళ్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా,.